ఏబిసిడి వర్గీకరణ పై కాలయాపన వద్దు.

ఏబిసిడి వర్గీకరణ పై కాలయాపన వద్దు.

-మాదిగ జేఏసీ మండల అధ్యక్షులు చిట్యాల నరేష్.

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి :  మండలంలోని మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జెఎసి రాష్ట్ర వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమూర్తి రవి ఆదేశాల మేరకు జెఎసి మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ అంశంపై కాలయాపన చేయవద్దని, తక్షణమే కేంద్ర ప్రభుత్వ స్పందించి వర్గీకరణ చేపట్టాలని కమిటీ పేరుతో కాలయాపన చేయవద్దని విమర్శించారు. కాలయాపన చేయకుండా వర్గీకరణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. చెయ్యని పక్షంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అంతం మాదిగల పంతం అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి ఉపాధ్యక్షులు కొక్కరేకల అనంద్, ప్రధాన కార్యదర్శి దేపాక సతీష్,ప్రచార కార్యదర్శి కొక్కరేక్కల నవీన్, చిట్యాల మహేష్, చిరంజీవి, దేపాక రవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment