నేషనల్ హైవేపై ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కారు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ శివారు నేషనల్ హైవే పైన ట్రాక్టర్ను కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రం నుండి నర్సంపేట వైపుకు వెళ్తున్న కారు చిన్నబోయినపల్లి చింతలమోరి సమీపంలో ట్రాక్టర్ ను కారు ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీ విడిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవే పై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై తాజుద్దీన్ ట్రాఫిక్ ను క్లియర్ చేయగా వాహనాలు యధావిధిగా నడిచాయి.