వెంకటాపురంలో హై స్కూల్లో జవహర్ నవోదయ పరీక్షలు
– పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జవహర్ నవోదయ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం 18వ తేదీ ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పరీక్షా కేంద్రం నిర్వహణ అధికారి జివి.వి. సత్యనారాయణ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. వెంకటాపురం, వాజేడు మండలాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన 112 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు, వీరిలో 45 మంది తెలుగు సబ్జెక్టు, 67 మంది విద్యార్థులు ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రం లో విస్తృతమైన ఏర్పాట్లతో పాటు, పకడ్బందీ ఏర్పాట్లను నిర్వహించారు. పరీక్షలను పర్య వేక్షించేందుకు పాలేరు నవోదయ విద్యాలయం నుండి ప్రత్యేక అధికారి రామకృష్ణ సైతం వెంకటా పురం చేరుకొని జవహర్ నవోదయ పరిక్షా కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరీక్షా కేంద్రం ఉపాధ్యాయుల బృందంతో పరీక్షల నిర్వహణ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలు శాంతియుత వాతావర ణంలో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. దూరప్రాంతం విద్యార్థులు శనివారం ఉదయం 10 గంటలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని నవోదయ విద్యాలయం ప్రత్యేక అధికారి రామకృష్ణ, వెంకటాపురం పరీక్షలు నిర్వహణ అధికారి జీవీవీ సత్యనారాయణలు విద్యార్థుల తల్లి దండ్రులకు సూచించారు.