పాత ఆలుబాక లో విద్యుత్ షాక్ తో గేదె మృతి
– తృటిలో తప్పిన ప్రమాదం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత ఆలుబాకలో గురువారం ప్రధాన రహదారి పక్కనే భారీ వర్షాలకు విద్యుత్ తీగలు తెగి పక్కనే ఉన్న నీటిమడుగులో తీగెలు పడిపోయాయి. మేతకు వెళ్ళిన గేదెలు రోడ్డు పక్కన ఉన్న నీటి గుంత నుండి దాటి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన రైతు ఎస్కే ముజాఫర్ కు చెందిన గేదె విద్యుత్ షాక్తో మృతి చెందింది.మరికొన్ని గేదెలు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు సైతం త్రుటిలో నీటిమడుగు వైపు వెళ్లకుండా వుండటంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డారు. విద్యుత్ శాఖ కు సమాచారం ఇవ్వటంతో అధికారు లు వెంటనే సరఫరా నిలిపివేశారు. సుమారు 40 వేల రూ. విలువైన సూడి గేదే మృతి చెందడంతో యజమాని ఎస్కే ముజాఫర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరంగా, విద్యుత్ శాఖ తరపున గేదె యజమానికి నష్టపరి హారం మంజూరు చేసే ఆదుకోవాలని సంబంధిత అధికా రులకు, విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.