ములుగు గట్టమ్మ వద్ద టెండర్లను రద్దు చేయాలి

Written by telangana jyothi

Published on:

ములుగు గట్టమ్మ వద్ద టెండర్లను రద్దు చేయాలి

– డీఎల్పీవో స్వరూపరాణిని సస్పెండ్ చేయాలి.

– ఆదివాసి నాయకపోడు నేత కొత్త సురేందర్

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఆదివాసి నాయకుడు ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద పూజారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఉద్దేశించి ఆదివాసి నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మాట్లాడుతూ ములుగు గట్టమ్మ వద్ద వేస్తున్న టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం గట్టమ్మ జాతర సమయం లో ఆర్డీవో, ఎమ్మార్వో, డి.ఎస్.పి ఆధ్వర్యంలో గట్టమ్మ పూజా రులకు, జాకారం గ్రామపంచాయతీకి చెందిన వారితో కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ఆదివాసి నాయక పోడ్ గట్టమ్మ పూజారుల డిమాండ్లు అధికారులకుచెప్పడం జరిగింద న్నారు. పూజారుల డిమాండ్లను పరిశీలించి అధికారులు సమస్వయంతో జాతరను విజయవంతం చేస్తామని తెలియజేసి డిమాండ్లను విని అధి కారులు మాకు ఏమి చెప్పకుండానే టెండర్లు నిర్వహిస్తున్నట్లు పాంప్లెట్లు విడుదల చేయడం సరైంది కాదన్నారు. ములుగు డీఎల్పీఓ స్వరూపారాణి అందదండలతో టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా జాకారం గ్రామపంచాయతీ నాయకులతో టెండర్లు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని అన్నారు. మా హక్కు లను కాలరాస్తున్న డీఎల్పీవో స్వరూప రాణిని వెంటనే సస్పెండ్ చేయాలని అని అదివాసి నాయకపోడ్ సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నా మన్నారు. టెండర్లు రద్దు చేయని యెడల కలెక్టర్ కార్యాలయంను ముట్టడి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారులు కొత్త సదయ్య కొత్త లక్ష్మయ్య, ఆకుల మొగిలి, అరిగెల సమ్మయ్య, ఆకుల పుల్లయ్య, కొండ పాడుచయ అర్థికల సంజీవ, ఆకుల రఘు, ఆకుల రాజు, అచ్చ రాజు, చిర్ర సంతోష్, కొత్త రవి, మండప సురేష్, అరిగెల రఘు, కొత్త రాజకుమార్, కొత్త రాజేష్, అరిగెల పూర్ణచందర్, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now