బావిలో పడి తండ్రీకొడుకుల దుర్మరణం

On: May 9, 2026 6:29 PM

బావిలో పడి తండ్రీకొడుకుల దుర్మరణం

బావిలో పడి తండ్రీకొడుకుల దుర్మరణం

లేగదూడను కాపాడే క్రమంలో విషాదం.

మరో మృతదేహం కోసం గాలింపు

ములుగు, మే 9, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో శనివారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని సుమారు 35 అడుగుల లోతైన బావిలో లేగదూడ పడిపోవడంతో దానిని కాపాడేందుకు తండ్రి, కొడుకు బావిలోకి దిగారు. అయితే ఇద్దరూ ఒకే తాడుతో దిగే ప్రయత్నంలో తాడు తెగిపోవడంతో బావిలో పడిపోయి నీటిలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో రస్పుత్ రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. పవన్ మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగుతోంది. ఈ విషాద ఘటనతో కర్లపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గోవిందరావుపేట సీఐ దయాకర్, ఎస్సై తాజుద్దీన్ ల ఆధ్వర్యంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!