హిందూ సమ్మేళన సభను విజయవంతం చేయాలి
భారీగా తరలిరావాలంటూ బైక్ ర్యాలీ
వెంకటాపురం, మే 8, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం నిర్వహించనున్న హిందూ సమ్మేళనం సభను విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలిరావాలని సమ్మేళన ఉత్సవకమిటీ పిలుపునిచ్చింది.ఈమేరకు శుక్రవారం సాయంత్రం ప్రజలు అధికంగా తల్లి రావాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల్లో సాగిన ర్యాలీలో పాల్గొన్న వారు సభకు భారీగా హాజరై జయప్రదం చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ హాజరుకానున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప దేవస్థానం ప్రాంగణంలో సమ్మేళనానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.









