వెంకటాపురంలో వాహనాల విస్తృత తనిఖీలు
రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన
వెంకటాపురం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలకు సంబంధించిన పత్రాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ శిక్షణ ఎస్ఐ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు ప్రయాణ భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులు మరియు సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.









