మిషన్ భగీరథ పైపు లీకేజి.. తాగునీరు రోడ్డుపై వృథా…

On: April 21, 2026 6:28 PM

మిషన్ భగీరథ పైపు లీకేజి.. తాగునీరు రోడ్డుపై వృథా...

మిషన్ భగీరథ పైపు లీకేజి.. తాగునీరు రోడ్డుపై వృథా…

కన్నాయిగూడెం, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండలంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజి సమస్య ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ముందర ప్రధాన పైపులో లీకేజి ఏర్పడి తాగునీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతూ వృథా అవుతోంది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ లీకేజి కారణంగా రహదారి దెబ్బతిని పరిసరాలు మురికిగా మారాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి లీకేజిని మరమ్మతు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!