Lok Adalat | జాతీయ లోక్ అదాలత్ పై సమీక్షా సమావేశం
– న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి టి మాధవి
ములుగు, డిసెంబర్18, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 30 న నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించి సోమవారం ములుగు బార్ అసోసియేషన్ మెంబర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో ములుగు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.మాధవి మాట్లాడుతూ “జాతీయ & రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల సూచనల మేరకు 30న ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి ములుగు బార్ అసోసియేషన్ మెంబర్స్ సహకరించాలని తెలిపారు. రాజీమార్గం ద్వారా రాజీ పడదగు అత్యధిక క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని తెలియజేశారు. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి న్యాయ సలహా సూచనల కొరకు అయిననూ న్యాయ సేవా అధికార సంస్థలను ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచన లను పొందగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. వేణుగోపాల చారి,బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మేకల మహేందర్, న్యాయ వాదులు యమ్. వినయ్ కుమార్, యమ్ వెంకటేశ్వర్ రావు, ఆర్. బిక్సపతి, కొండి రవీందర్,కె. సునీల్ కుమార్, బి. శ్యామ్ ప్రసాద్, బి.స్వామి దాస్, మేకల మానస, పి.అర్చన, బి.నవతా, జి. రజిత పి.రవికుమార్,ఎమ్. విజయ్ కుమార్ , ఓ. రాజేందర్, బల్ల ప్రతాప్, ఎస్. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Lok Adalat | జాతీయ లోక్ అదాలత్ పై సమీక్షా సమావేశం
Written by telangana jyothi
Published on:
1 thought on “Lok Adalat | జాతీయ లోక్ అదాలత్ పై సమీక్షా సమావేశం”