రోడ్డు భద్రతా నియమాలు పాటించండి
క్షేమంగా ఇంటికి చేరండి : పీఎస్ఐ తిరుపతిరెడ్డి
వెంకటాపురం నూగూరు, మార్చి 30, తెలంగాణ జ్యోతి: రోడ్డు ప్రయాణ భద్రతా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలని వెంకటాపురం పోలీస్ స్టేషన్ శిక్షణ పీఎస్ఐ తిరుపతిరెడ్డి వాహనదారులకు సూచించారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఇంధన శకట చోదకులు, ఇతర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఓవర్లోడ్తో ప్రయాణికులను ఎక్కించరాదని, వాహనానికి సంబంధించిన పత్రాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. భద్రతా నియమాల ను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజు, సివిల్ పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.









