అందరి సమన్వయంతో జాతర సక్సెస్ చేసుకున్నాం

On: February 3, 2026 8:27 PM

అందరి సమన్వయంతో జాతర సక్సెస్ చేసుకున్నాం

అందరి సమన్వయంతో జాతర సక్సెస్ చేసుకున్నాం

– జాతరలో లోపాలను సవరించుకుంటాం

– పూజారులు, మీడియాకు జరిగిన అసౌకర్యం పునరావృతం కాదు

– జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

ములుగు ప్రతినిధి, ఫిబ్రవరి3, తెలంగాణజ్యోతి: మేడారం మహా జాతర లో భక్తుల భద్రత, క్షేమంగా దర్శనం చేయించడంపైనే పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించిందని, జాతరలో లోపాలను సవరించుకొని వచ్చే జాతరకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతర సక్సెస్ కోసం కృషి చేసిన అందరికీ కృతజ్క్షతలు తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ జాతరలో నాలుగు రోజులలో భక్తులు అధికంగా తరలి వస్తారని, ఈసారి ముందస్తుగానే 80లక్షల మంది భక్తులు దర్శించుకోవ డంతో పాటు ప్రధాన జాతర సందర్భంగా కోటిన్నర మంది భక్తులు రాగా సజావుగా దర్శనం చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి క్రౌడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా జిల్లా పోలీసు అధికారులు 40రోజులు ఇక్కడే ముండి పనిచేశారని, గద్దెల పరిసరాలు కొత్తగా రూపుదిద్దుకోవడంతో పూజారులు, ఎండోమెంట్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు అసౌకర్యం కలిగిందన్నారు. వచ్చే మహాజాతరలో ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరుగ కుండా చర్యలు తీసుకుంటామన్నారు. జాతరపై రివ్యూ జరుపుకొని ఎలాంటి పొరపాట్లు జరిగాయో తెలుసుకున్నామని, తాడ్వాయి– మేడారం రూట్ లో ట్రాఫిక్ సమస్యలు ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలతో జరిగాయన్నారు. క్రైం రేట్ గత జాతరకంటే తక్కువగా ఉందని, యాక్సిడెంట్లు సైతం తక్కువగా ఉన్నాట్లు వెల్లడించారు. వీఐపీ, సాధారణ భక్తుల క్యూలైన్లలో మార్పులు చేపడుతామని, ఆధునిక సాంకేతిక పరిజ్క్షానంతో 36మందిని గుర్తించి పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. డ్రోన్ కెమెరాల సహాయంతో నిత్యం పర్యవేక్షిస్తూ సాధారణ భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామని, కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!