బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతీ ఒక్కరి భాధ్యత

Written by telangana jyothi

Published on:

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతీ ఒక్కరి భాధ్యత

– బాలల సంక్షేమ సమితి చైర్మన్ వసుధ

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం లోని రైతు వేదికలో జిల్లా బాలల పరిరక్షణ విభాగము సోషల్ వర్కర్ సుమన్ అధ్యక్షతన  రైతులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా  బాలల సంక్షేమ సమితి ఛైర్పర్సన్ వసుధ విచ్చేసి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ ఓ అనాగరిక చర్య అని, మైనర్ పిల్లలను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాల్యం అనేది ఎంతో అమూల్యమైన దశ అని మనిషి భవిష్యత్తుని నిర్ణయించేది బాల్యమేనని అన్నారు. తన బాల్యం ఎంత చక్కగా సాగితే, మనిషి భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుం దన్నారు. ఈ రోజుల్లో కూడా ఇంకా మైనర్ పిల్లలను పనిలో పెట్టుకోవడం బాధాకరం అన్నారు. 14 సం.ల లోపు పిల్లలు తప్పనిసరిగా బడిలోనే ఉండాలన్నారు. మిర్చి తోటల్లో ఎవరైనా బాల కార్మికులు ఉన్నట్లయితే వారిని గుర్తించి వారంతా తిరిగి చదువుకునేలా చూడాలని సూచిం చారు. బాల కార్మికులను గుర్తించడం, వారిని సంరక్షించడం ఎంత ముఖ్యమో ఆ సమస్య తీవ్రతను తగ్గించడం కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చే వారిలో 18 సం.ల లోపు పిల్లలను పనిలో లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే 6 సం.ల లోపు పిల్లల ను స్థానిక అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని సూచించారు. అనంతరం ఎఎల్ఓ వినోద మాట్లాడుతూ మిర్చి తోటల్లో పిల్లలను పనిలో పెట్టుకోవడం తీవ్రమైన చర్యని, అలాగే మేజర్ అయిన కూలీలకు శ్రమకు తగిన వేతనం ఇవ్వక పోవడం కూడా నేరమన్నారు. తల్లితండ్రులతో పాటుగా పిల్లలు వచ్చినప్పుడు వారికి సురక్షితమైన ప్రాంతంలో ఆశ్రయం ఇవ్వాలని సూచించారు. 14 సం.ల లోపు పిల్లలు ఏ పనిలో ఉన్నా, అలాగే 15-18 సం.ల లోపు పిల్లలను ప్రమాదకరమైన పనిలో నియమించినట్లయితే అటువంటి వారు చట్టపరంగా శిక్షార్హులే అన్నారు.అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడుతూ గతం నుండి ఇప్పటి వరకు పోల్చి చూస్తే బాల కార్మికుల శాతం ఈ ప్రాంతoలో చాలా వరకు తగ్గిందని, ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రైతులు సైతం భాగస్వామ్యం తీసుకోవడం కూడా ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అన్నారు. మన దేశానికి రైతు ఎంత ముఖ్యమో, మన దేశ భవిష్యత్తు కు వారసులు అయిన చిన్నారులు కూడా మనకు అంతే ముఖ్యం అని అన్నారు. కావున బాలల హక్కులను గౌరవించడం,కాపాడటం ప్రతీ ఒక్కరి భాధ్యత అని అన్నారు.అనంతరం బాల కార్మిక నిషేధం & క్రమ బద్దీకరణ చట్టం – 2016 మరియు ఇతర బాలల హక్కుల పై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతులతో మాట్లాడించి బాల కార్మికులను నిరోధించడంలో ఎదురవుతున్న అవరోధాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ మిరప తోటల్లోకి ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చే కార్మికుల సంక్షేమం కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా మైనర్ పిల్లలు ఉన్నట్లయితే వారిని పనిలో కాకుండా, ఒక గుడారం దగ్గర ఉంచి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించి వారిని చూసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో వారిని పనిలో పెట్టము అని రైతులు తెలపడం జరిగింది. అనంతరం ప్రతీ మిర్చి కోతల సీజన్ ప్రారంభo ముందుగానే, రైతులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని, మిర్చి కంపెనీల ప్రతినిధులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయిం చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల రైతులు, ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ, వాజేడు మండల ఇంచార్జ్ సుమన్, కోఆర్డినేటర్ నరేష్, సూపర్వైజర్లు సుదర్శన్, గీత, కేస్ వర్కర్ చంటి తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now