పద్మశాలి క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర పద్మ శాలి సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాటారం మండల కేంద్రంలో మంగళవారం ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎల గొండ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గాదె రమేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అడ్డగట్ల శ్రీధర్, రాష్ట్ర వాణిజ్య విభా గం నాయకులు పులి అశోక్, మీడియా విభాగం రాష్ట్ర నాయకు లు సామల శ్రీనివాస్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్య దర్శి ఖ్యాతం అనిల్ కుమార్, కాటారం మండల అధ్యక్షులు దోమల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.