సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
– డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఉపాధ్యాయ ఉద్యో గులకు రావలసిన పెండింగ్ డి ఏ లు, పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డి టి ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పీ రమణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు డి టి ఎఫ్ కాటారం మండల కమిటీ అధ్యక్షులు పీ రాజేశం ఆధ్వర్యంలో మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయు లు ఎంతో ఆవేదనతో పెండింగ్ డి ఏ ల కోసం ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి గా ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యా యులకు విద్యారంగ సమస్యలతో పాటు ఆర్థికపరమైన అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలోని పాఠశా లల్లో ఉపాధ్యాయుల కొరతతో చాలా ఇబ్బందులు తలెత్తుతు న్నాయని, వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన విధ్యావాలంటీ ర్లను నియమించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో లోనే పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయాలని, పాఠ శాలల్లో అసౌకర్యాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ నాయక్, రాజునాయక్ సంజీవరెడ్డి, మోహన్ తో పాటు సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.