కాటారంలో కాడ్రా ఏర్పాటు చేయాలి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: హైదరాబాదు తరహా లో హైడ్రా తరహాలో కాటారంలో కాడ్రా ను ఏర్పాటు చేయా లని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జక్కు శ్రావణ్ కోరారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కాటారం గ్రామపంచాయతీ లోని అన్ని చెరువులకు హద్దులు నిర్ణయిం చాలని కోరారు. అలాగే తిమ్మన్నకుంటకు గల ఐదు ఎకరాల 26 గుంటల విస్తీర్ణ భూమి రోజురోజుకు కబ్జాకు గురవుతు న్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మినీ స్టేడియం ఏర్పాటుకు అప్పటి కలెక్టర్ భవేష్ మిశ్రా స్పోర్ట్స్ అథారిటీ నుంచి 30 లక్షల రూపాయల గ్రాంటును సైతం మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియట్లేదు అని జక్కు శ్రావణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తిమ్మన్నకుంటతో సహా చెరువుల హద్దులను నిర్ణయించి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని, అలాగే కాటారంలో కాడ్ర ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను జక్కు శ్రావణ్ కోరారు.