మతిస్థిమితం లేని వ్యక్తితో ప్రయాణికుల ఇబ్బందులు
– రోడ్లపై సంచారం – బస్ స్టేషన్ లోనే మకాం.
– ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తి గత కొన్ని నెలలుగా సంచరిస్తూ రాత్రి, పగలు బస్ స్టేషన్ లోనే ఉంటున్నాడు. హిందీ భాష పోలిన భాషతో మాట్లాడు తున్న ఇతను సుమారు 50 సంవత్సరాలు వయసు ఉంటుం దని భావిస్తున్నారు. వెంకటాపురం ఆర్టీసీ బస్ స్టేషన్ లో రాత్రి సమయాల్లో బస్ స్టేషన్ లోని విద్యుత్ లైట్లు ఆర్ఫి వేయడం తో పాటు ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏర్పాటుచేసిన సిమెంట్ బెంచీలపై నిద్రిస్తున్నాడు. అంతేకాక ప్రయాణికులపై రాళ్లు విసరటం, మరుగుదొడ్లకు వెళ్లే ప్రయాణికులు మహిళ లపై అసభ్యంగా ప్రవర్తించడం తదితర వెకిలి, పిచ్చి చేష్టలతో ప్రయాణికులు హడలెత్తి పోతున్నారు. ఈ విషయంపై వెంక టాపురం ప్రయాణికుల ప్రాంగణం బస్సుల నియంత్రణ సిబ్బం ది, మతిస్థిమితం లేని వ్యక్తి శాష్టలపై ఆర్టీసీ అధికారులకు, మరియు పోలీస్ శాఖకు పలుమార్లు తెలియపరచినట్లు సమాచారం. వెంకటాపురం పోలీస్ శాఖ మతిస్థిమితం లేని వ్యక్తిని అనాధ శరణాలయానికి తరలించి ప్రజలకు, ప్రయాణి కులకు రక్షణ కల్పించాలని పత్రికా ముఖంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.