శ్రీ నాగులమ్మ ఆలయం లో కొత్తల పండుగ(పొట్ట పండగ)
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మీ నర్సా పూర్ గ్రామం లో వెలిసిన శ్రీ నాగులమ్మ అమ్మవారికి పూజా రులు, వడ్డెలు “కొత్తల పండగ” ను ఆదివాసీ సాంప్రదాయ బద్దం గా ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా “పుబ్బ కార్తే “ లో నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది. ఈ కార్యక్రమాల్లో భాగం గా శ్రీ నాగులమ్మ అమ్మవారి గద్దెలను, అడారాలను శుద్ధి చేసి, పసుపు కుంకు మలతో అలంకరించారు.అనంతరం సామలు, కొర్రలు, మొక్క జొన్నలతో పరమాన్నం వండి శ్రీ నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామి ఇంటి నుండి ఆర్తి బిడ్డల డోలు వాయిద్యాల నడుమ నాగులమ్మ ఏల్పు జెండాలతో తీసుకు వొచ్చి నాగులమ్మ అమ్మవారికి నైవేద్యం గా సమర్పిం చారు. వాటితో పాటుగా కొత్తగా పండిన కూరగాయలను అమ్మవారి గద్దెపై పెట్ట పూజలు నిర్వహించారు. కొత్తల పండగలో ముఖ్యమైన ఘట్టం “యెన్ను కట్టడం”. ఇందులో భాగంగా పొట్ట దశ లో ఉన్న వరి, మొక్కజొన్న, సామలు, కొర్రలు మొక్కజొన్న, గోంగూరతో పాటుగా మద్ది, పాల మండలతో దండ గా చేసి శ్రీ నాగులమ్మ గద్దె మీద ఉన్న స్తంభానికి, అదేవిధంగా ఆలయ ప్రాంగణం లో ఉన్న పగిడిద్ద రాజు, ఘడికమారాజు, ఎర్రమ్మ, సమ్మక్క, సారలమ్మ గద్దెల మీద ప్రతిష్టించిన స్తంభాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు జరిపి యెన్ను కడతారు.శ్రీ నాగులమ్మ అమ్మవారికి సంబంధించిన ఏల్పుల జెండాలతో డోలు వాయిద్యాల నడుమ జాగారం నిర్వహించారు. ఆదివాసీ భక్తులు పంటలు సమృద్ధిగా పండాలని,ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మ వారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమాలను బాడిశ రామకృష్ణ స్వామి ఆధ్వర్యం లో నిర్వహించగా పూజారులు, వడ్డెలు సోడి సత్యం ,కుర్సం పుల్లయ్య,కోర్స శ్రీ కాంత్, మూయ బోయి న శివ, కుర్సం నాగసాంబయ్య, తుర్స చిన్న బ్బాయి, కట్టం సమ్మక్క,సోడి శ్రీను కులపెద్దలు కుర్సం విష్ణు మూర్తి, కోర్స సమ్మక్క, ముసలయ్య, కుర్సం శ్రీను తదితరులు పాల్గొన్నారు.