బిసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పంతకానీ శ్రీనివాస్
తెలంగాణ జ్యోతి,కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన పంత కాని శ్రీనివాస్ ను బిసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు గండి చెరువు వెంకన్న గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహక రించిన జాతీయ అధ్యక్షుడు గండి చెరువు వెంకన్న గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవీ బాధ్యత లు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని పంతకాని శ్రీనివాస్ అన్నారు. బిసీ సంఘాన్ని మరింత బలో పేతం చేయ డానికి శాయశక్తులా కృషి చేస్తానని, బిసీ కులాల ఐక్యత కోసం, బిసీల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమా నికి, అభ్యున్నతికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు.