బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలి.
–గొండ్వానా సంక్షేమ పరిషత్ డి మాండ్.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన అత్యవసర సమావేశం జిఎస్పి,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావే శంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడు తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతామని గత అసెంబ్లీ తీర్మా నాన్ని, నూతన ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1976లో ఓటు బ్యాంకు కోసం లంబాడీ లను ఎస్టీ జాబితాలో కలిపి,మొదటిసారి ఆదివాసీలను కాంగ్రె స్ పార్టీ మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ సారి 11 గిరిజ నేతరుల కులాలను, ఎస్టీ జాబితాలో కలపాలని గత పాలక ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేస్తుంటే, ఆదివాసి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.,ఎన్ని ప్రభుత్వాలు మారినప్ప టికీ ఆదివాసి బ్రతుకులు మాత్రం మారడం లేదని,ఆదివాసీ చట్టాలు జీ.వో.లు పూర్తి స్థాయిలో అమలుకి నోచుకోవడం లేదని,రాజకీయ పార్టీలలో ఉన్న ఆదివాసి ఎమ్మెల్యేలు ఒక్క సారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదివాసి జాతిలో జన్మించి నందుకు గర్వపడాలి కానీ, గిరిజనేతరులతో కుమ్మక్కై ఆదివాసి చట్టాలు అమలు కాకుండా అడ్డు పడుతు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివాసీలు అడవిని నమ్ముకుని జీవిస్తున్నారని అడవి పై, భూమిపై నీటిపై సర్వ హక్కులు ఉన్నప్పటికీ నేటికీ ఆదివాసీలు తమ పట్టా భూము లలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆదివాసులకు ఒరిగేది ఏమీ లేదని పూనెం సాయి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధన కార్య దర్శి కణితి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.