సురక్షితమైన, స్వేచ్ఛాయుత ఎన్నికలను నిర్వహిద్దాం.
- ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : సురక్షితమైన, స్వేచ్ఛాయుత ఎన్నికల ను నిర్వహించుకుందామని, ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని, ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గౌస్ ఆలం ఐపిఎస్ అన్నారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండల కేంద్రంలో శనివారం ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం , ఏ ఎస్ పి సిరి శెట్టి సంకీర్తి ఐపీఎస్ ల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం, వాజేడు మండలాల్లో అసాంఘిక శక్తులు ఎన్నికల సమయంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు, దుచ్చెర్ల కు భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. పోలీస్ శాఖ ఎల్లవేళలా ప్రజా భద్రత తో స్వేచ్ఛాయుత ఓటింగ్ లో ఓటర్లు పాల్గొనేందుకు ప్రజల సహకారంతో విధులు నిర్వహిస్తుందన్నారు. ఈ సంధ్ ర్భంగా జి ల్లా ఎస్.పి. మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి, చట్టాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలక్షన్ సందర్భంగా అదనపు పోలీస్ బలగాలు జిల్లాకు చేరుకున్నాయన్నారు .ఫ్లాగ్ మార్చ్ లో సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఏఎస్పి సిరిశెట్టి సంకీర్త, వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి కుమార్, సిఆర్పిఎఫ్ అధికారి, వాజేడు, పేరూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లు వెంకటేశ్వరరావు, రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
1 thought on “సురక్షితమైన, స్వేచ్ఛాయుత ఎన్నికలను నిర్వహిద్దాం. ”