అయ్యప్ప బిక్ష లో పాల్గొన్న శ్రీనుబాబు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి:అయ్యప్ప స్వామి భిక్ష కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహోదరుడు, శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొ న్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి లో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో మంత్రి శ్రీధర్ బాబు సౌజన్యంతో ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమంలో శ్రీనుబాబు పాల్గొని అయ్యప్ప స్వాముల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అయ్య ప్ప స్వాములు సామూహిక భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, వారితో కలిసి శ్రీను బాబు సహ పక్తి భోజనం చేశా రు. ఈ సందర్భంగా శీను బాబు మాట్లాడుతూ పాడిపంటలు సమృద్ధిగా పండి, ప్రజలంతా సుఖ సంతో షాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భిక్ష కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేము నూరు ప్రభాకర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, అయ్యప్ప దేవాలయ నిర్వాహకులు బచ్చు అశోక్ గుప్తా, ప్రకాష్ గుప్తా, పీచర్ రామకృష్ణారావు, జనగామ కార్తీక్ రావు, కరుణాకర్ రావు, కొట్టే ప్రభాకర్, చీమల రాజు, పసుల మొగిలి, అంగజాల అశోక్, బొమ్మన శ్రీనివాస్ రెడ్డి , ప్రభాకర్ రెడ్డి, కడారి విక్రమ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.