వెంకటాపురం మార్కెట్ ఆసీలు వేలం రూ.5.56 లక్షలు
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 17, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మేజర్ పంచాయతీ పరిధిలోని మార్కెట్ ఆసీలు (ఫీజు వసూలు హక్కులు) వేలం రూ.5 లక్షల 56 వేలలకు ఖరారైంది. శుక్రవారం జి.పి కార్యాలయంలో సర్పంచ్ తాటి సరస్వతి అధ్యక్షతన నిర్వహించిన వేలం కార్యక్రమంలో కాంట్రాక్టర్ పుల్లగుమ్మి జగన్మోహన్ రావు అత్యధికంగా పాట పాడి హక్కులను దక్కించుకున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో గతంలో పలుమార్లు ఈ వేలం వాయిదా పడగా, ఈసారి విజయవంతంగా పూర్తయింది. కాగా జంతువధశాల మరియు బందెల దొడ్డి వేలం పాటలు మద్దతు ధర రాకపోవడంతో వాయిదా పడ్డాయని అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఈ వేలాల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి, ఇన్చార్జి ఎంపీడీవో జమ్మిలాల్, ఉప సర్పంచ్ సరిపుద్దిన్, పంచాయతీ కార్యదర్శి జి. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.









