నూగూరు వెంకటాపురం చేరుకున్న రెండు మర పడవలు

Written by telangana jyothi

Published on:

నూగూరు వెంకటాపురం చేరుకున్న రెండు మర పడవలు

– నాటు పడవలను కూడా వరదల సమయంలో సిద్ధం చేసుకుని ఉంచాలి.

– వరదల సమయంలో ఫ్లడ్ డ్యూటీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో గోదావరి వరదల సమయంలో ముంపు కు గురి అయ్యె ప్రజలను సురక్షిత ప్రాంతాలు కు తరలించేందుకు మరపడవలను రెవెన్యూ కార్యాలయాలకు ముందుగానే తరలించి, సిద్ధం చేసి ఉంచారు. అంతేకాక గోదావరి పరివాహక ప్రాంతాల్లో నాటు పడవలు కూడా వరదల సమయంలో అవసరమైన సమయాల్లో వాడు కునేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్లడ్ డ్యూటీ అధికారులు సిబ్బంది వారి కి కేటాయించిన ప్రాంతాల లో డ్యూటీల ప్రకారం విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే వెంకటాపురం మండలంలో వరద నీరు చుట్టుముట్టే గ్రామాలను, గత వరదల ఫ్లడ్ రికార్డుల ప్రకారం ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాల కుతరలించే విధంగా మర పడవలను, నాటుపడాలని కూడా వినియోగించుకోవాలని ఆదేశాలు జారిఅయ్యాఇ. అలాగే వరద నీరు చుట్టుముట్టే గ్రామాలలో గర్భిణీ స్త్రీలు, దర్గకాలిక వ్యాధులతో బాధపడే వారి ని ముందుగానే గుర్తించి, ప్రభుత్వ వైద్య శాలలో అందుబాటులో ఉంచుకోవాలని,ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ములుగు జిల్లా లక్కవరం సరస్సు నుండి టూరిజం శాఖ ద్వారా రెండు మరపడవలను, శుక్రవారం సాయంత్రం లారీల ద్వారా వెంకటాపురం రెవిన్యూ కార్యాలయానికి చేరుకున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, గోదావరి నీటిమట్టం కూడా పెరుగుతుండటంతో, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది .భారీ వర్షాలు గోదావరి వరదలు కారణంగా,వాగులు దాటవద్దని ,చేపల వేటకు వెళ్ళవద్దని , అదికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీస్ శాఖ గ్రామాలలో వరదల సమయంలో ముందు స్తు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. మండల పరిధిలోని ఆలుబాక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చేపల వేటకు వెళ్లి, గోదావరిలో గల్లంతయినట్లు సమాచారం. మరో మూడు నాలుగు రోజులు భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది్ ఒకపక్క భారీ వర్షాలు, మరోపక్క గోదావరి వరదలు పెరుతుండటంతో , ముంఫు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు కు తరలించేందుకు, భవిష్యత్తు గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే వరదల సమయంలో ముంపు కు గురి అయ్యే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా, వరద బాధిత పునరావస కేంద్రాలను ముందుగానే, వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ వసతి గృహం, ఆలుబాక ప్రభుత్వ వసతి గృహం, వరద బాధిత పునరావాస కేంద్రాలుగా గుర్తించినట్లు సమాచారం.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now