భారీ వర్షాలు వరదలతో స్తంభించిన జనజీవనం
– గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి, వర్షపు నీరు
వెంకటాపురం నూగూరు. తెలంగాణ జ్యోతి : భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండ లాల్లో అనేక వాగులు వంకలు రికార్డు స్థాయిలో పొంగి ప్రవ హిస్తున్నాయి. కుంభ వర్షం కారణంగా పల్లపు ప్రాంతా లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు తోడు గోదావరి వరద మెల్లగా తగ్గుతూ ,మళ్ళీ పెరుగుతూ దోబూసులాడు తున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద మొదటి హెచ్చ రికను జారీ చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు 44 అడుగులు కు వరద నీటిమట్టం చేరినట్లు ప్రకటించారు. అలాగే ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహ దారిపై వరద నీరు చేరటంతో గత నాలుగు రోజులుగా అంత ర్రాష్ట్ర రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక్కడ రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల ఆదిశంపై మూడు రోజుల క్రితమే బారి కేట్లు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో విద్యుత్తు లైన్ల పై చెట్లు విరిగిపడటంతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్ఫ డింది. బుధవారం సాయంత్రం నుండి అనేక చోట్ల ప్రళయ గర్జనలతో పిడుగులు పడ్డాయి. రెవెన్యూ, పోలీస్ యంత్రాం గం ముందస్తు జాగ్ర త్తలలో భాగంగా చేపల పేటకు వెళ్ళ రాదని, వాగులు దాటరాదని ఇంకా అనేక వరద భద్రతా పరమైన హెచ్చ రిక లను జారీ చేశారు. వాజేడు ముల్లకట్ల గోదావరి వంతెన వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతున్నది. గోదావరి తల్లి శాంతించ మంటూ, అనేకమంది మహిళా సోదరీమణులు పసుపు, కుం కాలతో పూలతో గోదావరి నదిలో జారవిడిచి వేడుకున్నారు. భారీ వర్షాలు వరదల కారణంగా వారం రోజులుగా వ్యవసా య పనులు స్తంభించిపోయాయి.