వెంకటాపురం – భద్రాచలం ప్రధాన రహదారి పరిశీలన
– ఎమ్మెల్యే, ఆర్ అండ్. బి .చీఫ్ ఇంజనీర్ బృందం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : భద్రాచలం నియోజకవర్గంలోని ములుగు జిల్లా జగన్నాధపురం వై జంక్ష న్ నుండి రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 ను వెంకటాపురం నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన రహదారిని బుధవారం రోడ్లు భవనాల శాఖ రాష్ర్ట ఉన్నతాధికారుల ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది. ఈ మేరకు భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ల బృందానికి వెంకటాపురం మండలం ఆలుబాక సూరవీడు కాలనీ గ్రామాల ప్రాంతంలో చీఫ్ ఇంజనీర్ ను కలు సుకొని రహదారి సమస్యను వివరించారు. రెండు సంవత్స రాల క్రితం రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమై నేటికీ పూర్తి కాలేదని దీంతో భద్రాచలం, చర్ల, వెంకటాపురం వాజేడు వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీరింగ్ బృందానికి వివరించారు. గోదావరి ఇసుక సొసైటీ ర్యాంపులు లారీల కారణంగా వేల లారీలు వెంకటాపురం మండలం నుండి రాక పోకలు సాగిస్తుండడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఇసుక లారీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసే విధంగా ములుగు జిల్లా కలెక్టర్ తో సంప్రదించి రోడ్డు మరమ్మతు పనులను పూర్తిచేసేందుకు కృషి చేస్తామని రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ హామీ ఇచ్చారు. అలాగే వెంకటాపురం పట్టణం లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందు కు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సం దర్భంగా వెంకటాపురం మండలం వీరభద్రారం పాలెం గ్రామం నుండి ఎదిర ఒంటి చింతలగూడెం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర నిలిచి ఉన్న వేలాది ఇసుక లారీల క్యూ లైన్ ను పరిశీలించారు. భారీ వర్షాలు కారణంగా గత ఆరు రోజులుగా ఇసుక క్వారీలలో ఇసుక లోడింగ్ పనులు నిలిచి పోయాయి. కాగా రోడ్డుపై ఇసుక లోడింగ్ కోసం వచ్చే లారీలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా దెబ్బతిన్న పంటలు వివరాలు, మిర్చినారు మళ్ళు ను పరిశీలించి రైతుల తో మాట్లాడారు. భారీ వర్షాలు కారణంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మన్యం సునీల్ చౌదరి, రమేష్, మాజీ ఎంపిటిసి రవి, సీతాదేవి, పిల్లారి శెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు.