మౌలిక వసతులు లేని టోల్ గేట్ వసూళ్లను నిలుపుదల చేయాలి
– ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం మండలం మేడిపల్లి (బస్వాపూర్) వద్ద మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటుచేసిన టోల్ ప్లాజా వసూళ్ల ను తక్షణమే నిలుపుదల చేయాలని కాటారం బిఆర్ఎస్ నాయ కుడు జక్కు శ్రావణ్ పేర్కొన్నారు.ప్రతి సోమవారం కలెక్టర్ కార్యా లయంలో నిర్వహించే ప్రజావాణిలో టోల్గేట్ వసూళ్లను తక్షణమే నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేశారు. కాటారం, భూపాల పల్లి నేషనల్ హైవే 353 సి మేడిపల్లి లో ఏర్పాటు చేసిన టోల్గేట్ వద్ద మౌలిక వసతులు కల్పించకుండా వాహనదారుల నుండి టోల్ వసూలు చేస్తున్నారని, టోల్ చెల్లించే వాహనదారునికి అత్యవసరంగా ఉపయోగపడే మరుగుదొడ్లు, మంచినీరు, విశ్రాం తికి అవసరమయ్యే పార్కింగ్ స్థలం, ఫుడ్ కోర్ట్, అత్యవసర సమయంలో ఉపయోగపడే నేషనల్ హైవే సేఫ్టీ అథారిటీ వెహికల్ ను ఏర్పాటు చేయకుండానే, కాంట్రాక్టర్ కనీస ప్రమాణా లు పాటించకుండా టోల్ గేట్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొ న్నారు. తక్కువ వెడల్పుతో నిర్మించిన టోల్గేట్ నుండి భారీ వెడల్పాటి వాహనాలు వెళ్ళుటకు ఇబ్బంది అవుతున్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలేశ్వరం నుండి హనుమకొండ వరకు నేషనల్ హైవే రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ గుంతలు, రోడ్లపై భారీ వాహనాలు వెళ్లిన గాడాలు ఎడ్ల బండి గాడాల వలె ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ఎంతోమంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారని వెంటనే కలెక్టర్ స్పందించి టోల్ ప్లాజా వసుళ్ల ను నిలుపుదల చేయాలని ఫిర్యాదుల పేర్కొన్నారు. విషయంపై గతంలో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నెలలు గడిచిన కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నేషనల్ హైవే అధికారులు పట్టించుకోకపోవడం లేదని సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని రోడ్డుకు మరమ్మతులు చేయిం చాలని తెలిపారు