ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ 

Written by telangana jyothi

Published on:

ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ 

– భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే

భూపాలపల్లి ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఐపీఎస్ గురువారం పత్రిక సమావేశంలో తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా పోలీస్ కార్యా లయం లలో సెక్యూరిటీ గార్డ్స్ , స్వీపర్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు కాంట్రాక్టు తనకి వస్తుందని నమ్మ బలికి కరీంనగర్ టౌన్ కు చెందిన 1) గుర్రం శ్రీనివాసరావు, తండ్రి పేరు లింగారావు, వయసు 41 సంవత్సరాలు, కులం వెలమ, వృత్తి వ్యాపారం అను అతను. అతని కింద పని చేసే 2) సన్నాయిల సుభాష్, తండ్రి సమ్మయ్య, కులం మాదిగ ,సుభాష్ కాలనీ భూపాలపల్లి మరియు 3) మోకిడి అశోక్, తండ్రి పేరు భద్రయ్య, వయసు 29, కులం మాదిగ, వృత్తి డ్రైవర్, కాసింపల్లి గ్రామం కలిసి భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగులు, ఆశావాహుల నుండి ఒక్కొక్కరి వద్ద లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు మొత్తం దాదాపు 50 నుండి 60 లక్షలు వసూలు, చేసి కొన్ని రోజులు జాబు కల్పించినట్లు వారిచే డ్యూటీలు చేయించి, జీతాలు ఇవ్వకుండా తప్పించుకు తిరిగేసరికి వారికి అనుమానం రావడంతో గుర్రం శ్రీనివాసరావు ను నిలదీయగా కొంత మందికి డబ్బులు తిరిగి ఇచ్చాడు, మిగతా బాధితులకు చెక్కులు రాసి ఇవ్వగా శ్రీనివాసరావు అకౌంట్ లో డబ్బులు లేకపోయేసరికి డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు శ్రీనివా సరావు ను నిలదీసి అడగగా అతడు, అతని కింద పని చేసే వ్యక్తులు అందరు కలిసి భూపాల పల్లి కలెక్టరేట్ కార్యాలయం పక్కన వారిని కొట్టి వారి వద్ద గల చెక్కును, లాక్కుని, చంపుతానని బెదిరించగా, ఈ విషయమై భాదితుడైన పిర్యాదిదారుడు దొంగల చందు, తండ్రి రాజయ్య, నివాసం : గాంధీ నగర్ , ఘనపూర్ మండలం , భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో శ్రీనివాసరావు, అతని కింద పనిచేసే సుభాష్, అశోక్ పై ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసి నిందితులైన పై వారిని పట్టుకొని వారి నుండి అట్టి చెక్కును, వారి వద్ద గల ఒక కారును స్వాధీనపరచుకొని గురువారం వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈఆ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ ఎవరైనా ఇలా నిరుద్యోగుల, ఆశవాహలను ఆసరాగా చేసుకుని ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తే చట్ట పరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిం చినారు. అలాగే ఎవరైనా ఇలా మోసపోయి ఉంటే వెంటనే వచ్చి సంబధిత పోలిసు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పి కిరణ్ కోరారు. ఈ కేసు చేధనలో ఉత్తమ విధులు నిర్వర్తించిన డిఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, భూపాలపల్లి, సిసిఎస్ ఎస్ఐ లు ప్రసాద్, సుధాకర్, రమేష్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ సదానందం, భూపాలపల్లి పిఏస్ కానిస్టేబుల్లు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, రాంబాబులను ఎస్పి కిరణ్ ఖరే అభినందించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now