ఫోటో ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరణ
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఫోటో టెక్ ఆధ్వర్యంలో జులై 26. 27. 28. తేదీలలో హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్ నందు జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్లను శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ మహాదేవపూర్ మండల కేంద్రంలో గురువారం రోజున భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ రఫీ చేతులమీదుగా ఆవిష్కరించారు. రఫీ మాట్లాడుతూ హైదరాబాదులో జరుగు ఫోటో ట్రేడ్ ఎక్స్పో కు జిల్లా నుండి అధిక సంఖ్యలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ మిత్రులు పాల్గొని టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను తెలుసుకొని ఎక్స్ఫో ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షులు గోపరాజు రాజు, జిల్లా సహాయ కార్యదర్శి రంగు రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి కారుకూరి సతీష్, ప్రసాద్, కొండు మల్లేష్, మహాదేవపూర్ మండల అధ్యక్షులు మేకల రాజేష్, ప్రధాన కార్యదర్శి పెండ్యాల నరసింహ స్వామి, గౌరవ అధ్యక్షులు బుర్ర లింగయ్య, సుధాకర్, సాగర్, రాజు డీజే, ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పంతకాని సమ్మయ్య, చిప్ప జయంత్ తదితరులు పాల్గొన్నారు.