ములుగులో దొంగలు తిరుగుతున్నారు.. జాగ్రత్త ..!

Written by telangana jyothi

Published on:

ములుగులో దొంగలు తిరుగుతున్నారు.. జాగ్రత్త .. ! 

– గుర్తు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వండి

– వీడియోను విడుదల చేసిన పోలీసులు

ములుగు ప్రతినిధి : చిరు వ్యాపారులు, రోడ్ సైడ్ దుకాణాలే లక్ష్యంగా ములుగులో దొంగలు తిరుగుతున్నారు  జాగ్రత్తగా ఉండాలంటూ ములుగు ఎస్సై వెంకటేశ్వర్ రావు సూచిం చారు. ములుగు, మల్లంపల్లిలో అనుమానిత వ్యక్తులకు సంబంధించిన వీడియోలను ఆదివారం విడుదల చేశారు. ములుగు జిల్లా కేంద్రంతోపాటు మల్లంపల్లి గ్రామంలో కూర గాయలబండ్లు, పండ్ల షాపులు, ఇతర చిన్న షాపులలో సరుకులు కొనడానికి వచ్చినట్లు నటిస్తూ షాపు నిర్వాహ కులను మాటల్లో పెట్టి వాళ్లు పనుల్లో ఉన్నప్పుడు దృష్టి మరల్చి క్యాష్ బ్యాగులు దొంగతనం చేస్తున్నారని వెల్లడిం చారు. రాత్రిళ్లు షాపుల డోర్లు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ముఖం కనిపించకుండా మాస్కులు, హెల్మెట్లు ధరించి తిరుగుతున్నారని పేర్కొన్నారు. ములుగు లోని బాలోజీ ఆస్పత్రి ఎదుట పండ్ల వ్యాపారి క్యాష్ బ్యాగును దొంగిలించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ములుగు, మల్లంపల్లి గ్రామాల్లో తిరుగుతున్న దొంగ లకు సంబంధించిన వీడియాల్లో కనిపిస్తున్న అనుమానిత వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే వెంటనే ములుగు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దుకాణాలు, చిరు వ్యాపారులు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తలు వహించాలని, అనుమానం వస్తే వెంటనే ములుగు ఎస్సై 8712670081, పోలీస్స్టేషన్ 8712670082 నెంబర్లకు ఫోన్ చేసి సమా చారం ఇవ్వాలని కోరారు. లేనట్లయితే 100కి కూడా కాల్ చేయొచ్చన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now