శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వానికి తావు లేదు

శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వానికి తావు లేదు

– భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే 

భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపా లపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ ఐలతో ఎస్పి నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని అడిగి తెలుసు కుని,సత్వర కేసుల చేధనకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టి గేషన్ ఉండడంతో పాటు పూర్తి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. నేర చేధన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని ఎస్పి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ లో అలసత్వానికి తావివ్వొద్దని, పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి చట్ట పరిధిలో వెంటనే కేసులు నమోదు చేసి వేగంగా సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.గంజాయి, డ్రగ్స్ నియం త్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణా, అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, గడ్డం రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, సుభాష్ బాబు, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment