సీసీ కెమెరాల సహాయంతో దొంగ అరెస్ట్ 

Written by telangana jyothi

Published on:

సీసీ కెమెరాల సహాయంతో దొంగ అరెస్ట్ 

– 24 గంటల్లో ఛేదించిన కాటారం పోలీసులు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ కళాశాలలో జరిగిన దొంగతనం కేసులో నింది తుణ్ణి సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి అరెస్ట్ చేసినట్లు కాటారం ఎస్ ఐ మ్యాక అభినవ్ తెలిపారు. 24 గంటల్లో కేసు ను ఛేదించినట్లు పేర్కొన్నారు. ఈనెల 3న రాత్రి సమయంలో కాటారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ బాయ్స్ కళాశాలలో ల్యాబ్ లో భద్రపరచిన శ్యాం సంగ్ యల్ ఈ డీ టీవీ (55 ఇంచులు)ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగల గొట్టి, లోపలికి చొరబడి ఎత్తుకెళ్లడం జరిగినదని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టామని అభినవ్ వివరించారు. అందులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు గంట పరి పూర్ణం గంటగూడెం కాలనీ నివాసుడిగా గుర్తించి, మంగళ వారం కాటారం లోని అతని ఇంటివద్దనే నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అతని నుండి దొంగిలించబడిన ఎల్ ఇ డీ టీ వీ ( విలువ : 66,000/-) ని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. నింది తుడు గంట పరిపూర్ణం ఇదివరకు గత 2022 సంవత్సరంలో ట్రాక్టర్ బ్యాటరీ దొంగతనం కేసు, గత ఏప్రిల్ నెలలో గంజాయి కేసులో నిందితుడిగా ఉండి జైలు కి కూడా వెళ్ళి ఇటీవలే బెయిల్ పై వచ్చి ఇంటివద్దనే ఉంటూ, తనకు జల్సాలు చేయడానికి డబ్బులు దొరకనందున తాను ఈ దొంగతనానికి పాల్పడ్డానని విచారణలో ఒప్పుకున్నాడన్నారు. ఈ విచారణ లో సిబ్బంది కానిస్టేబుల్స్ లవన్, సంపత్, నాగరాజు, రఘు, నరేష్, హోం గార్డ్స్ తిరుపతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ప్రతి గ్రామాలలోని ప్రజలు ప్రధాన కుడళ్ళలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడం సాధ్యమవు తుందని, అందరు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కాటారం ఎస్ ఐ మ్యాక అభినవ్ కోరారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now