కొత్తగూడ ఆదివాసి పోరుకేక సభను విజయవంతం చేయాలి
ఆదివాసీలు బహిరంగ సభకు భారీగా తరలిరావాలి
ఏటూరునాగారం, మే20, తెలంగాణజ్యోతి : కొత్తగూడలో నిర్వహించను న్న ఆదివాసి పోరుకేక బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ప్రతి గ్రామం, ప్రతి గూడెం నుంచి అధిక సంఖ్యలో ఆదివాసులు సభకు తరలిరావాలని కోరారు. ఏటూరునాగారం తుడుం దెబ్బ అధ్యక్షుడు యాలం దేవేందర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా డివిజన్ అధ్యక్షుడు పోడెం శోభన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పోడెం బాబు, రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణరావు, ఏఎస్యూతో పాటు పలువురు ఆదివాసి నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో చందరాజు, కుర్సం రమేష్, చాద మల్లయ్య, కొమరం బాలయ్య, చర్ప శ్రావణరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ సందర్భంగా పోరు కేక సభ కరపత్రాలను ఆవిష్కరించారు








