TUWJ(IJU) జిల్లా కమిటీ సభ్యులకు ఘన సత్కారం
కన్నాయిగూడెం జర్నలిస్టుల ఆధ్వర్యంలో అభినందనలు
కన్నాయిగూడెం, మే 20, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం జర్నలిస్టుల సంఘం TUWJ(IJU) ఆధ్వర్యంలో జిల్లా కమిటీకి ఎన్నికైన సభ్యులకు ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. మండలం నుంచి జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సునార్కని శ్యామ్, జిల్లా ఈసీ సభ్యుడిగా ఎన్నికైన మల్లేష్లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో TUWJ(IJU) కమిటీ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొని సభను విజయవంతం చేశారు.








