జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
– ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ పథకాలు వర్తించే లా కృషి చేస్తా
– పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ
– ములుగులో ప్రెస్ క్లబ్ నూతన భవనానికి భూమి పూజ
ములుగు, జనవరి6, తెలంగాణ జ్యోతి : జర్నలిస్టుల సంక్షేమాని కి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు . శనివారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణం నిమిత్తం అధికారులు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. మంత్రి సీతక్కకు వేద పండితుడు కొలనుపాక సదాశి వుడు జర్నలిస్టుల తో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మంత్రి సీతక్క ప్రెస్ క్లబ్ నూతన భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి సీతక్క జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారూ.. జర్నలిస్టులే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదు లని అన్నారు. అలాంటి జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు .ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా కృషి చేస్తానని ఆమె అన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇంది రమ్మ ఇండ్ల నిర్మాణాలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ముందుగా ములుగులో ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణం నిమిత్తం భూమి పూజ చేయడం జరిగిం దని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. కాగా, జర్నలిస్టులంతా మంత్రి సీతక్కకు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందించడంతో పాటు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఐటీడీఏ పీవో అంకిత్, పంచాయతీ రాజ్ శాఖ ఈ ఈ, ఎఇ, ఆర్డీవో సత్యపాల్ ,డిపిఆర్ఓ రఫిక్, కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,జిల్లా నాయకులు బాదం ప్రవీణ్, బాణోత్ రవిచందర్ తో పాటు జర్నలిస్టులు, ఎండి షఫీ అహ్మద్, బేతి సతీష్, జాలిగం శ్రీనివాస్, పిట్టల మధుసూదన్, దూడబోయిన రాకేష్ ,గంపల శివ, సుంకరి సంపత్, భూక్య సునీల్, ఒద్దుల మురళి ,మాట్ల సంపత్, జినుకల ప్రభాకర్, కొండం రవీందర్ రెడ్డి,ఆలుగొండ రమేష్, ఎండి జలీల్ ,గోల్కొండ రాజు, చుంచు రమేష్ ,కేతురు బిక్షపతి, సృజన్, సుమన్, రాజ వర్ధన్ ,రఫీ, చుంచు రవి, కొండి మహిపాల్, శ్రీధర్, అరవింద్, రంజిత్, నగేష్ ,బద్రి ,కొమురయ్య, శంకర్, రఘువీర్ ,రాజు, యుగేందర్, రాజేందర్, రవి రాజా ,శివ ,రాము, మహేందర్ గౌడ్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
1 thought on “జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట”