రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం తరలించాలి 

On: March 18, 2026 6:11 PM

రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం తరలించాలి 

రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం తరలించాలి 

పౌరసరఫరాల అధికారికి డీలర్ల వినతి

ములుగు, మార్చి 18, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలోని రేషన్ డీలర్ల వద్ద నిల్వగా ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వెంటనే లిఫ్ట్ చేయాలని కోరుతూ జిల్లా పౌరసరఫరాల అధికారి ఫైజల్ హుస్సేన్ కు డీలర్లు వినతిపత్రం అందజేశారు, తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికే డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని తరువాత తీసుకువెళ్తామని చెప్పి సంవత్సరం గడిచినా ఇప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో బియ్యం పురుగులు పట్టి నాణ్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం వల్ల నిల్వ ఉంచుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు, దొడ్డు బియ్యాన్ని వెంటనే తరలిస్తే ఆ స్థానంలో కొత్త బియ్యాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు, కావున జిల్లా సివిల్ సప్లై అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని బియ్యాన్ని లిఫ్ట్ చేయాలని డీలర్లు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జన్ను రవి, మండలాల అధ్యక్షులు కూరాకుల రమాదేవి, నరసన్న, రాజునాయక్, రాంబాబు, సునీల్, కమలాకర్, సుమన్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!