పదవీ విరమణ ఉద్యోగికి ఘన వీడ్కోలు

On: April 30, 2026 6:34 PM

పదవీ విరమణ ఉద్యోగికి ఘన వీడ్కోలు

పదవీ విరమణ ఉద్యోగికి ఘన వీడ్కోలు

ములుగు, ఏప్రిల్ 30, తెలంగాణ జ్యోతి: ములుగు 5వ బెటాలియన్‌లో మినిస్ట్రియల్ స్టాఫ్‌గా పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ బిక్సపతికి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం తో పాటు ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు. విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందిన బిక్సపతి సేవలు బెటాలియన్ అభివృద్ధికి ఎంతో దోహద పడ్డాయని పేర్కొన్నారు. కమాండెంట్ మాట్లాడుతూ ఆయన కృషి, నైతిక విలువలు, సహచరులతో కలిసి మెలిసి పనిచేసే స్వభావం ఆదర్శప్రాయమని ప్రశంసించారు. భవిష్యత్తులో ఆయనకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం బిక్సపతికి స్మారక చిహ్నం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు కిరణ్ కుమార్, సాయిబాబు, వెంకటేశ్వర్లు, అశోక్ తదితర అధికారులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!