వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాటి సరస్వతి

On: December 3, 2025 8:16 PM
వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాటి సరస్వతి

వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాటి సరస్వతి

వెంకటాపురం, డిసెంబర్ 03, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున తాటి సరస్వతి అభ్యర్థిత్వం ఖరారైంది. 2019లో వెంకటాపురం గ్రామపంచాయతీకి వార్డు సభ్యురాలిగా విజయం సాధించిన ఆమె, అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు నెలలపాటు వెంకటాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎదిర పంచాయతీలో మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని 18 పంచాయతీలలో ఎదిర గ్రామపంచాయతీలో మూడు, వెంకటాపురం మేజర్ పంచాయతీలో తొలి వార్డు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా తాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన బీ.సీ మరిగూడెం, పాత్రపురం, వెంకటాపురం, ఆలుబాక, సూరవీడు గ్రామపంచాయతీ కేంద్రాల్లో పోలీసు బందోబస్తు కట్టుదిట్టంగా అమలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!