తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం
తెలంగాణ జ్యోతి, నర్సంపేట: మాజీ ప్రధాని” భారతరత్న ” పి.వి. నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ లో తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు పురోహిత జ్యోతిష రంగం లో..వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపూరం గ్రామనికి చెందిన బ్రహ్మశ్రీ కడివెండి శివశర్మ ని “తెలుగు వెలుగు మహానంది” జాతీయ పురస్కారం చే సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా బ్రహ్మ శ్రీ కడివేండి శివ శర్మ కి వెంకటాపురం గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేశారు.