పోస్ట్ ఆఫీస్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
– ములుగు పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్
తెలంగాణ జ్యోతి ఏటూరునాగారం : జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని ప్రజలు పోస్ట్ ఆఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ పథకాలపై సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, ప్రతి కుటుంబానికి తప్పకుండ ఇన్సూ రెన్స్ చేస్తూ వారికి భరోసా కలింగించాలని, ప్రతి ఆడపిల్ల భవిషత్తు కోసం నిర్మానాత్మకంగా తీసుకువచ్చిన సుకన్య పతకం పై బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లు ప్రజలకు చేరువై పథకాల గురించి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సబ్ పోస్ట్ మాస్టర్ లు, మెయిల్ ఓవర్సిల్ లు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లు పాల్గొన్నారు.