ఆధార్ అప్డేట్ ఛార్జీల్లో మార్పులు
హైదరాబాద్, ఏప్రిల్ 30, తెలంగాణ జ్యోతి: ఆధార్ అప్డేట్ సేవలపై UIDAI కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ నమోదు పూర్తిగా ఉచితంగా కొనసాగుతుండగా,బయోమెట్రిక్ మార్పులకు రూ.125 ఛార్జీ నిర్ణయించారు. అయితే 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు సెప్టెంబర్ 30, 2026 వరకు ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాల సవరణకు రూ.75 ఛార్జీ విధించనున్నారు. కాగా జూన్ 14, 2026 వరకు myAadhaar పోర్టల్ ద్వారా ఈ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఛార్జీలన్నీ పన్నులతో కలిపి నిర్ణయించినవేనని అధికారులు తెలిపారు.









