ఏటూరునాగారంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ఏటూరునాగారం,తెలంగాణజ్యోతి: మండలంలోని రామాలయం ప్రధాన కూడలిలో కృష్ణా అష్టమి సందర్భం గా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, గ్రామస్థులు, మహిళలు భక్తులు పెద్ద ఎత్తున ఉట్టి కొట్టే కార్యక్రమానికి హాజరయ్యారు. ఉట్టి కొట్టిన అనంతరం మొదటి, ద్వితీయ, తృతీయ, బహుమతులను గెలుపొందిన వారికి అందించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం కోలాహలంగా కొనసాగగా ప్రజలు తిలకించారు.