శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి సన్నిధిలో ఎండోమెంట్ ట్రిబునల్ కోర్ట్ జడ్జి

Written by telangana jyothi

Published on:

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి సన్నిధిలో ఎండోమెంట్ ట్రిబునల్ కోర్ట్ జడ్జి

కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు జడ్జి మంద వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యు లతో కలిసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించు కున్నారు. వారిని ప్రధాన రాజగోపురం ముందు నుండి అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేయించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహన అధికారి ఏ.మారుతి వారికి స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. వేద పండితు లు అర్చక స్వాములు జడ్జి దంపతులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave a comment