క్రీడలు స్నేహ సంబంధాలను, శరీర దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి

Written by telangana jyothi

Published on:

క్రీడలు స్నేహ సంబంధాలను, శరీర దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి

– అట్టహాసంగా ప్రారంభమైన మండల స్థాయి వాలీబాల్ పోటీలు. 

– క్రీడలను ప్రారంభించిన వెంకటాపురం సిఐ కుమార్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడ నైపుణ్యాలు ఇలాంటి పోటీల్లో పాల్గొంటనే వెలుగులోకి వస్తాయని, గ్రామీణ క్రీడలు స్నేహ సంబంధాలను, శరీర దారుఢ్యాన్ని పెంపొదిస్తాయని వెంకటా పురం సిఐ బండారి కుమార్ అన్నారు. ఆదివారం వెంకటా పురం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలను సి.ఐ కుమార్ లాంఛ నంగా ప్రారంభించి, క్రీడాకారులను టీమ్ ల వారిగా పరిచ యం చేసుకున్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశంపై గ్రామీణ యువత చెడు అలవాట్లకు, మాదక ధ్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా, వారి దృష్టి మళ్లించేందుకు, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో గెలుపొందిన టీమ్లను, డివిజన్, జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించే వారిని ప్రోత్సాహం అందిస్తామన్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 18 టీంలు పోటీలలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి .ఆర్. పి. ఎఫ్. డి .ఎస్. పి. ప్రశాంత్, వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పె క్టర్ కె. తిరుపతిరావు, పి.డి సత్యనారాయణ, పి.ఈ.టి.లు గొంది హనుమంతరావు, నరసింహమూర్తి, భార్గవ్, సివిల్, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now