రామాలయంలో వైభవంగా గోదాదేవి కళ్యాణం
ములుగు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని రామాలయంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త చింతలపూడి నరసింహారెడ్డి శమంత దంపతులు శ్రీ గోదా రంగ నాయకుల స్వామి కళ్యాణాన్ని జరిపారు. ఈసందర్భంగా అర్చకులు భక్తులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వాసుదేవరెడ్డి, కోశాధికారి ప్రశాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మేడికొండ వెంకటరెడ్డి, కార్యదర్శి బాణాల రాజ్ కుమార్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.