అసంపూర్తిగా ఎస్సి కమ్యూనిటి హల్
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం లో ఎస్సి కమ్యూనిటి హాల్ నిర్మాణం ఏళ్లుగా పూర్తి కావడంలేదు. గత ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల క్రితం 25లక్షల వ్యయంతో మంజూరు చేశారు. దళిత కమ్యూనిటి భవనానికి శంకు స్థాపన చేసి స్లాబ్ వరకు పూర్తి చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా పనులు నిలిచి పోయాయి. ఎస్సి కాలనిలో తమ కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో ఏదైనా శుభకార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా, వారు సభలు సమావేశాలు ఏమైనా కార్యాలు నిర్వహించడానికి కమ్యూనిటి హాల్ నిర్మాణం తలపెట్టారు. పనులను పూర్తి చేసి భవనాన్ని వినియోగంలోకి తేవాలని అధికారులు, ప్రజాప్రతినిధులను దళితులు కోరుతున్నా స్పందన లేదా. పాలకులు, అధికా రులకు ఎన్ని సార్లు మొరమెట్టుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు మారినా దళితుల బతుకులు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు.కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిటి హాల్ నిధులను నిలిపివేయాలని ఆదేశించడంతో గ్రామస్థులకు అసంతృప్తి మారింది.అంతేకాకుండా సదరు కాంట్రక్టర్ ను ఫోన్ లో సంప్రదించగా టీఆరెస్ ప్రభుత్వం ఉన్నపుడు జీఓ మాత్రమే ఇచ్చింది. ఈ జిఓ బట్టి డిఈ ,ఏఈ పనులు చెప్పించారు.ఇప్పటి వరకు ఈ భవనానికి13 లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రొసీడింగ్స్, సాంక్షన్ లేదు అందుకే పెడ్డింగ్ లో ఉంటున్నా యన్నారు. అధికారులు వెంటనే స్పందించి గుర్రెవుల పరిధిలో ఉన్న ఎస్సి కమ్యూనిటి భవనం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.