అంబరాన్ని అంటిన సంక్రాంతి పండుగ సంబరాలు

అంబరాన్ని అంటిన సంక్రాంతి పండుగ సంబరాలు

అంబరాన్ని అంటిన సంక్రాంతి పండుగ సంబరాలు

– ముగ్గుల పోటీలు, పిండి వంటల గుమగుమలు

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : సంక్రాంతి పర్వది నం సందర్భంగా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలో ఆనందోత్స వాల మధ్య పండుగను జరుపుకున్నారు. పిండి వంటలు గుమ,గుమలు డుడూ బసవన్నల ఆటలతో వెంకటాపురం మండలంలో సందడి నెలకొన్నది. వెంకటాపురం పట్టణ కేంద్రంలో మంగళవారం పండుగ సందర్భంగా వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను బస్టాండ్ సమీపంలోని దేవస్థానం గ్రౌండ్లో  ఏర్పాటు చేశారు. పోటీలకు వచ్చిన మహిళలు, తిలకించదానికి వచ్చిన వారితో దేవస్థానం గ్రౌండ్ కిటకిటలాడింది. వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా టెంట్లు, కుర్చీలు వేసి కాంగ్రెస్ నాయకులు సదుపాయం కల్పించారు. మొత్తం 43 టీములు ముగ్గుల పోటీల్లో పాల్గొనగా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సోలేషన్ బహుమతి అందజేశారు. బహుమతుల ప్రధానోత్సవానికి వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, గ్రామ ప్రముఖులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరై బహుమతుల అందజే శారు. మొదటి బహుమతిగా 5వేల116 రూ. నగదును మాజి ఎంపీటీసీ కాంగ్రెస్ నేత గార్లపాటి రవి స్పాన్సర్ చేశారు. అలాగే రెండో బహుమతి 4 వేల116 రూ.ను మండల కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసింది. అలాగే మూడో బహుమతిగా హర్ష వాటర్ ప్లాంట్ అధినేత, 3వేల116 రూ. నగదు స్పాన్సర్ చేశారు. గ్రోమోర్ కోరమాండల్ ఇతరుల సహకారంతో బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు,మన్యం సునీల్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్నాటి నాగేశ్వరావు, కాళ్ళ సుందర్రావు, శ్రీరాముల రమేష్ , చక్ర కళాధర్ రావు, సుంకరి రంగయ్య నాయుడు , మాజీ ఎంపీటీసీ గార్లపాటి రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మంగమ్మ,ధనపనేని నాగరాజు , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాధన పెల్లి శీను, మాజీ ఎంపీటీసీ సీతాదేవి, ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment