వైభవంగా గోదాదేవి కళ్యాణం
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదిపూర్ మండలo కాళేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానం అనుబంధ దేవాలయమైన రామాలయంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల స్వామి కళ్యాణ మహోత్సవం మంచి వైభవంగా నిర్వహించారు. ప్రధానార్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ, రామాలయం అర్చకులు ఆరుట్ల రామాచారి, వేద పండితులు, అర్చకులు శ్రీగోదా రంగనాయకుల స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా నెల రోజులపాటు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శాశ్వత కళ్యాణం దాతలకు, గ్రామస్తులకు భక్తులకు అర్చక స్వాములు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరెంటెంట్ బుర్రి శ్రీనివాస్, దేవస్థానం మాజీ చైర్మన్ పోత వెంకటస్వామి, మాజీ ధర్మకర్తలు, గ్రామస్తులు భక్తులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.