క్రీడలతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెంపొందుతోంది
– జిల్లా స్థాయి బేస్ బాల్ ముగింపు వేడుకల్లో వక్తలు
ములుగు ప్రతినిధి : క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పెంపొం దుతుందని, క్రీడల్లో జిల్లా యువత రాణించాలని వక్తలు పిలుపునిచ్చారు. ములుగులోని సన్ రైస్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి బేస్ బాల్ ఎంపికలు నిర్వహించగా మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవించదర్, సన్ రైస్ స్కూల్ ప్రిన్సిపల్ పెట్టెం రాజు, వైస్ ప్రిన్సిపల్ బల్గూరి జనార్ధన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్, మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో బేస్ బాల్ క్రీడపై ఎక్కు వ దృష్టి సారించాలని, విద్యార్థులు క్రీడల్లో జిల్లా, రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిం చాలని పిలుపు నిచ్చారు.క్రీడల నిర్వహణ కోసం అందరూ సహకరించాల న్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువుల్లో సైతం మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయిలో విజేతలను క్రీడా కారులు ఈనెల 13, 14, 15తేదీల్లో మహబూబాబాద్ జిల్లా లో జరిగే నాల్గవ అంతర్రాష్ట్ర బేస్ బాల్ పోటీల్లో పాల్గొంటా రని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో 132మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బేస్ బాల్ క్రీడా యూనియన్ జిల్లా కార్యదర్శి లావుడ్య రమేష్, కోశాధికారి పాడ్య కార్తీక్, జాయింట్ సెక్రటరీ నూనావత్ రాజశేఖర్, కోచ్ అజ్మీర సురేష్, పీఈటీలు శ్రీకాత్, ప్రభు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొ న్నారు.