ఎడతెరిపిలేని భారీ వర్షం
– రైతులు టార్ఫలిన్లతో ఉరుకులు పరుగులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మంగళవారం రాత్రి నుండి ప్రారంభ మైన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, ఖరీఫ్ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులు తడవ కుండా రైతులు టార్బ ల్ లు పట్టుకొని పరుగులు తీస్తున్నారు. మబ్బులు కమ్మిన ఆకాశంతో వర్షం పడే సూచనలతో ఉదయం నుండి వాతావరణంలో మార్పులు సంభవించాయి. అయితే మంగళవారం సాయంత్రం నుండి ప్రారంభమైన వర్షాలకు ప్రధాన వాణిజ్య పంట మిర్చి తోటలకు, సిలీంద్ర జాతి తెగులతో పాటు, పురుగులు ఆశించే అవకాశం ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.